Showing posts with label Perspectives in Education. Show all posts
Showing posts with label Perspectives in Education. Show all posts

Friday, October 27, 2017

తెలంగాణ టిఆర్‌టీలో మార్కులను ప్రభావితం చేసే..విద్యా దృక్పథాలు


తెలంగాణ టిఆర్‌టీలో మార్కులను ప్రభావితం చేసే..విద్యా దృక్పథాలు


టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టిఆర్‌టీ)లో విజయం కోసం దృష్టిసారించాల్సిన అంశాల్లో

👉 పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ కీలకమైంది.

 పిఈటీ / స్కూల్‌ అసిస్టెంట్‌, పీడీ మినహా అన్ని విభాగాలకు నిర్వహించే రాత పరీక్షలో ఈ అంశాన్ని చేర్చారు. ప్రస్తుత టిఆర్‌టీలో ఈ అంశానికి 10 మార్కులు* కేటాయించారు. ఇందులో మంచి మార్కులు రావాలంటే ఏవిధంగా సన్నద్ధం కావాలో చూద్దాం..


టిఆర్‌టీలో అభ్యర్థుల మార్కులను అధికంగా ప్రభావితం చేసే విభాగం పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టు (విద్యా దృక్పథాలు)ను భావించవచ్చు. ఎందుకంటే గత టెట్‌ సిలబస్‌కు ప్రస్తుతం ఇచ్చిన టిఆర్‌టీ సిలబస్‌లోని కంటెంట్‌కు ఏ మాత్రం తేడా లేదు. ఈ నేపథ్యంలో పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌కు ప్రిపరేషన్‌లో సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి.


విద్యా దృక్పథాలు

ప్రస్తుత సిలబస్‌ను, గత ప్రశ్న పత్రాల్లో ఇచ్చిన అంశాల ఆధారంగా అప్పటి సిలబస్‌ను విశ్లేషించి ప్రశ్నల పరిధిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.


సిలబస్‌

Unit - I
విద్య - చరిత్ర:

ఉత్తర వేదకాలం,
పూర్వ వేదకాలం,
మధ్య యుగాల్లో విద్య పరంగా వచ్చిన మార్పులు,
విద్య నిర్వచనం


కమిటీలు - కమిషన్‌లు:

స్వాతంత్ర్యానికి పూర్వం, తరవాత విద్యపై వేసిన

కమిటీలు, వాటి సిఫారసులు -

👉ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854,
👉హంటర్‌ కమిషన్‌ 1882,
👉హార్టాగ్‌ 1929,
,👉సాట్లండ్‌ కమిషన్‌ 1944,
👉మొదలియార్‌ కమిషన్‌ 1952 - 53,
👉కొఠారి కమిషన్‌ 1964 -66,
 👉ఈశ్వరీబాయి పటేల్‌ కమిషన్‌ 1977,

👉ఎన్‌పిఇ 1986,

👉పిఔ 1992.



విద్యకు సంబంధించి గతంలో అమలు చేసిన, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలు:

👉ఒబిబి,
👉ఏపిపిఇపి,
👉డిపిఇపి,
👉ఎస్‌ఎస్‌ఏ,
👉ఓపెన్‌ స్కూల్స్‌,
👉 సాక్షర భారత్‌ మిషన్‌,
👉మధ్యాహ్న భోజన పథకం,
👉ఎన్‌పిఇజిఈల్‌ పథకం,
👉కస్తూర్బా పాఠశాలలు,
👉ఆర్‌ఎంఎస్‌ఏ,
👉సక్సెస్‌ పాఠశాలలు.



ఉపాధ్యాయ విద్య, విద్యా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో గల సంస్థలు:

👉ఎన్‌సిఇఆర్‌టి,
👉ఎన్‌సిటిఇ,
👉సిసిఆర్‌టి,
👉యుజిసి,
👉ఇఫ్లూ,
👉ఎన్‌ఐఇపిఏ,
👉ఎస్‌సిఇఆర్‌టి,
👉ఎస్‌ఐఈంఎటి,
👉డైట్‌,
👉ఎస్‌ఆర్‌సి,
👉ఎస్‌ఒపిటి, వంటివి.


Unit - II
ఉపాధ్యాయుని సాధికారత:

అర్థం, సాధికారతను పెంపొందించే మార్గాలు, ఉపాధ్యాయుని వృత్తిపరమైన నైతిక ప్రవర్తనావళి,

ప్రేరణ కల్గించే అంశాలు, సాధికారతను పెంపొందించే సంస్థలు,
 ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుడు పాఠశాలల్లో

నిర్వహించే రికార్డులు, రిజిస్టర్లు.

Unit - III
ప్రస్తుత ఆధునిక సమాజంలో విద్య పోకడలు:

👉సార్వత్రిక విద్య,
👉ప్రజాస్వామ్య విద్య,
👉ఆర్థిక విద్య,
👉విలువల విద్య,
👉జనాభా విద్య,
👉సమ్మిళిత విద్య,
👉ప్రైవేటీకరణ - ప్రపంచీకరణ,
👉కౌమార విద్య,
👉పర్యావరణ విద్య,
👉జీవన నైపుణ్యాలు.


Unit - IV
విద్యలో నూతనంగా చేసిన చట్టాలు, సంస్కరణలు:

   👉ఆర్‌టిఇ - 09 (విద్యాహక్కు చట్టం),
 👉బాలల హక్కులు,
 👉సమాచార హక్కు చట్టం,
👉మానవ హక్కులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకారం బాలల హక్కులు - 2010.


Unit - V
జాతీయ విద్యా ప్రణాళిక చట్టం (ఎన్‌సిఎఫ్‌ 2005), సిసిఇ (నిరంతర సమగ్ర మూల్యాంకనం).



స్థూలంగా

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి), స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ), లాంగ్వేజ్‌ పండిట్‌ సిలబస్‌ రెంటినీ కలిపి స్థూలంగా ఎనిమిది భాగాలుగా విభజించారు. ఇప్పుడు టాపిక్‌ నుంచి వచ్చిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం.

విద్య - చరిత్ర, అర్థం, వివిధ కాలాల్లో విద్యాపరంగా వచ్చిన మార్పులు

ఈ అంశంలో ఎక్కువగా విద్యపై విద్యావేత్తల నిర్వచ నాలు, పూర్వకాలంలో విద్యావిధానం, బౌద్ద కాలంలోని విద్యావ్యవస్థ, వారు పొందిన జ్ఞానం, ఆ సమయంలో విద్యార్థులకు నిర్వహించే ఉత్సవాలు వంటి ప్రశ్నలు అడిగారు. అంతేగాక ముస్లిం కాలంలోని విద్యా విధానం, వారి పాఠశాలల పేర్లు, నేర్చుకొనే సబ్జెక్టులు, బోధనా విధానం పై ప్రశ్నలు వచ్చాయి.



గత డిఎస్సీ ప్రశ్నలు (ఎస్‌జిటి, ఎస్‌ఏ, లాంగ్వేజ్‌ పండిట్స్‌ - తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ)

1.    మక్తబ్‌లు అనే విద్యా సంస్థలు మధ్య యుగంలో ఎవరికి సంబంధించినవి? (ఎస్‌ఏ - 2012)

ఎ) ముస్లింల ప్రాథమిక విద్యా కేంద్రాలు

బి) వృత్తి విద్యా కేంద్రాలు

సి) మతపరమైన విద్యా కేంద్రాలు

డి) ప్రాథమిక కేంద్రాలు


2.    ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకొని మానసిక బలం పెరిగి బుద్ధి కుశలత విస్తరించి తద్వారా వ్యక్తులు తమ కాళ్లపై తాము నిలబడగల్గుతారో అటువంటి విద్య మనకు కావాలి అన్నది ఎవరు?

ఎ) మహాత్మాగాంధీ

బి) అరవిందుడు

సి) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌   

డి) స్వామి వివేకానందుడు

3.    విహారాలు ఎవరికి చెందిన విద్యా సంస్థలు?

ఎ) జైన మతం

బి) వేద అభ్యసనం

సి) హిందూ మతం   

డి) బౌద్ద మతం


4.    ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అన్నది ఎవరు?

ఎ) గాంధీ

బి) ప్లేటో

సి) అరిస్టాటిల్‌

డి) దయానంద సరస్వతి


5.    మూడు ఖల్లో సరైంది?

ఎ) రీడింగ్‌ (చదవడం), రీసెర్చింగ్‌, అరిథమెటిక్‌

బి) రైటింగ్‌ (రాయడం), రీడింగ్‌, రీసెర్చింగ్‌

సి) అరిథమెటిక్‌ (లెక్కించడం), రీడింగ్‌, రైటింగ్‌

డి) హోం వర్క్‌ (ఇంటిపని), రికగ్నైజింగ్‌, రిమెంబరింగ్‌


కమిటీలు - కమిషన్లు

కమిటీలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించి ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో భాగంగా స్వాతం త్ర్యానికి ముందు బ్రిటీష్‌ వారు ఏర్పాటు చేసిన కమిటీలు, స్వాతంత్య్రం తరవాత మన ప్రభుత్వాలు వేసిన కమిటీలు, వారికి అధ్యక్షత వహించిన వారి వివరాలు, సిఫారసులు, అమల్లో ఉన్న విధానాలపై చాలా ప్రశ్నలు వచ్చాయి.

1.    బ్రిటీష్‌ వారి కాలంలో భారతదేశంలో ప్రతి ప్రావిన్స్‌లో ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌’ను స్థాపించాలని ప్రతిపాదించింది?

ఎ) హంటర్‌ కమిషన్‌ 1882

బి) ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854

సి) లార్డ్‌ రిప్పన్‌   

డి) విలియం బెంటింక్‌ 1835


2.    ‘ఆంగ్ల విద్య మాగ్నాకార్టా’ అని దేన్ని పిలుస్తారు?

ఎ) హార్టాగ్‌ కమిషన్‌ 1929

బి) ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854

సి) సార్జంట్‌ కమిషన్‌ 1944

డి) మొదలియార్‌ కమిషన్‌ 1952-53


3.    యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని దేన్ని పిలుస్తారు?

ఎ) మొదలియార్‌ కమిషన్‌

బి) నూతన జాతీయ విద్యా విధానం

సి) కొఠారి విద్యా ప్రణాళిక   

డి) సార్జంట్‌ కమిషన్‌


4.    పాఠశాల విద్యా ప్రణాళికలో ఎస్‌యుపిలను ఏ ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టారు?

ఎ) యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌

బి) కొఠారి కమిషన్‌

సి) సెకండరి ఎడ్యుకేషన్‌

డి) ఈశ్వరీబాయ్‌ పటేల్‌ కమిటి


5.    అపవ్యయం అంటే?

ఎ) విద్యను పూర్తిచేయకుండా మధ్యలో మానడం

బి) ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడం

సి) గుణాత్మక విద్యను అందించడం

డి) చదువులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం


ప్రస్తుతం అమల్లోఉన్న పథకాలు

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, వాటి మార్పులను ఈ అంశంలో ప్రస్తావించారు. ఇటీవల బాగా విజయవంతమై కేంద్రం నిధులు ఇస్తున్న పథకాలపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

1.    సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక అనేది ఏ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం?

ఎ) ఏపిపిఇడి

బి) ఒబిబి

సి) డిపిఇపి

డి) ఎన్‌పిఇజిఈల్‌


2.    రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ లక్ష్యం?

ఎ) అందరికీ 2013 నాటికి దిగువ సెకండరీ విద్య, 2017 నాటికి ఎగువ సెకండరీ విద్యను అందించడం

బి) ప్రాథమిక హక్కుగా అందరికీ సెకండరీ విద్య

సి) 2020 నాటికి బాలికలందరికీ సెకండరీ విద్యనందించడం

డి) 2020 నాటికి అందరికీ దిగువ సెకండరీ విద్యనందించడం


3.    భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం?

ఎ) కేరళ  

బి) తమిళనాడు

సి) ఆంధ్రప్రదేశ్‌

డి) కర్ణాటక


4.    ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతోపాటుగా ఇంగ్లీష్‌ మీడియంలో విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలలు?

ఎ) ఆదర్శ పాఠశాలలు

బి) సక్సెస్‌ పాఠశాలలు

సి) నవోదయ పాఠశాలలు

డి) ఆశ్రమ పాఠశాలలు

Sunday, July 3, 2016

విద్యా హాక్కు చట్టం 2009 ( ఉచిత నిర్బంధ విధ్య కు బాలల హక్కుల చట్టం )

విద్యా హాక్కు చట్టం 2009 ( ఉచిత నిర్బంధ విధ్య కు బాలల హక్కుల చట్టం )

  • ఈ చట్టం లో 7 అధ్యాయాలు 38 నిబంధనలు కలవు.
  • ఈ చట్టాన్ని ఉచిత, నిర్బందవిద్యకు బాలల హక్కు చట్టం, ఆగస్ట్ 2009 గా పిలువవచ్చును.
  • 2009 జులై 20 వ తేదీన భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది.
  • ఆగస్ట్ 26, 2009 న భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపినారు.
  • ఈ చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశమంతంటికీ వర్తిస్తుంది.
  • బాలలు అంటే 6-14 సం.ల బాలబాలికలు
  • ప్రాధమికవిధ్య అంటే 1-8 తరగతుల వరకు
  • T.C లేకపోయినా, విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదు.
  • చట్టం అమలుకు నిధులు వాటా కేంద్ర, రష్ట్ర ప్రభుత్వాలు 65:35 ప్రకారం భరిస్తాయి.
  • క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి 10 రెట్ల వరకూ జరిమానా
  • గుర్తింపు లేకుండా, గుర్తింపు రద్దయిన తర్వాత బడి నడిపితే   లక్షరూపాయిలు జరిమానా, ఒకవేళ ఉల్లంఘన ఇంకా కొనసాగినట్లయితే ప్రతిరోజు రూ. 10,000లు జరిమానా
  • ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10% కి మించరాదు.
  • ఏ టీచరూ కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధన చేయరాదు.


Tags:విద్యా హాక్కు చట్టం 2009 ( ఉచిత నిర్బంధ విధ్య కు బాలల హక్కుల చట్టం ), విద్యా హాక్కు చట్ట, ఆగస్ట్ 2009, విద్యా సంవత్సరం

Saturday, July 2, 2016

హంటర్ కమిషన్- 1882

హంటర్ కమిషన్- 1882

ఉద్దేశం:

  • ఉడ్ తాఖీద్ సిఫారసులను సక్రమంగా అమలు పరచుటకు ఏ చర్యలు తీసుకోవాలో సూచించుటకు గవర్నర్ జనరల్ రిప్పన్ "సర్ విలియం హంటర్" ను భారతీయ విధ్య కమీషన్ అధ్యక్షుడిగా నియమించాడు.
  • హంటర్ కమీషన్ ను " తొలి  భారతీయ విధ్య కమీషన్" అని కూడా అంటారు.
  • ప్రాథమిక విధ్యలో మార్పులు తేవడం ప్రధానోద్దేశంగా ఏర్పడిన కమీషన్. 
ముఖ్యాంశాలు: 
  •  ప్రాథమిక విధ్యను స్థానిక సంస్థలకు అప్పగించి అందరికీ అందుబాటులోకి తేవాలి.
  • స్వదేశీ పాఠశాలలను ప్రొత్సహించాలి.
  • ఉపాధ్యాయులకు వృత్తి విధ్యలో శిక్షణ ఇవ్వాలి.
  • ఉపాధి విధ్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • అరోగ్యం, శీలం విద్యాభ్యాసంలో భాగం కావాలి.
  • మాధ్యమిక మరియు ఉన్నత పాఠశాలలను ప్రైవేటు పరం చెయ్యాలి.
  • ప్రాథమిక విధ్యను మాతృభాషలోనే బోధించాలి.
  • స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
 ఫలితం:
  • విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడి పెరిగి, విద్యావ్యవస్థ క్రమంగా విస్తరించడం జరిగింది.

Thursday, December 25, 2014

Perspectives in education Mp3 Download


Perspectives in education 


Unit -I.1 Download Mp3 Download


UPLOAD ......



dsc perspectivesdsc 2014 syllabus dsc new syllabus 2014  dsc syllabus 2014  8th class history audiofree download  ap dsc 2013 new syllabus   ap dsc studymaterial   ap dsc syllabus  ap dscpsychology material  apdsc hindi material  d.s.c.syllabus hindi  in education study material in telugu,dsc perspectives in education study material in telugu pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu,dsc perspectives in education study material in telugu pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu,dsc perspectives in education study material in telugu pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu.dsc perspectives in education study material in telugu pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu

Friday, November 21, 2014

విద్యా దృక్పధాలు విద్యాహక్కు చట్టం 2009 (Perspectives in Education )



విద్యాహక్కు చట్టం - 2009

 
  • ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్యను హక్కుగా కల్పించబడింది.  ఇది 86 వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 21 ఎ కి అనుబంధంగా కల్పించబడింది.  ఉచితంగా విద్యను హక్కుగా పొందే  ఈ సవరణ వలన మంచి పరిణామము ఇవ్వాలని కోరుతుంది .
  • పాఠశాల నిర్వహణాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలందరికీ ఉచిత విద్యను కల్పించాలి.  ప్రైవేటు పాఠశాలలు తమ పాఠశాలలలో 25 శాతం పిల్లలకు ఎటువంటి రుసుము లేకుండా ప్రవేశము కల్పించాలి.
  • నాణ్యతతో పాటు అన్ని రకాల ప్రాథమిక విద్యా విషయాలను పర్యవేక్షించుటకు గాను జాతీయ సంఘం ఏర్పాటు చేయాలి.
ఈ  చట్టం ఎందుచేత అత్యంత ఆవశ్యకము ?

  • ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య మరియు తరువాత స్థాయి విద్య ఏర్పాటుని శాసననిర్మాణం చేస్తుంది
  • ప్రతి ఆవాసానికి ఒక పాఠశాలని ఏర్పాటు చేస్తుంది
  • పాఠశాల పర్యవేక్షక కమిటీ (పాఠశాల నిర్వహణను పర్యవేక్షించే ఆ ఆవాసంలో గల ఎన్నికైన సభ్యులు) ఏర్పాటు చేస్తుంది.
  • ఆరు నుండి పద్నాలుగు (6-14) సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలెవరూ పనిలోకి వెళ్ళకుండా   శాసనం చేస్తుంది 
 

Perspectives in Education  DSC and TET exams notifications,results, material,important bits,Guidance,  Perspectives in Education, DSC preparation guidance