Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Thursday, October 17, 2019

తళ్ళికోట యుద్దం

తళ్ళికోట యుద్దం
***********
కారణము: భారతదేశ ముస్లిం దండయాత్ర
తేదీ: జనవరి 26, 1565
స్థలము: ప్రస్తుత కర్ణాటకలోని రాక్షసి-తంగడి
పరిణామము: దక్కన్ సల్తనత్ల విజయము
ప్రత్యర్ధులు
విజయనగర సామ్రాజ్యము దక్కన్ సల్తనత్‍లు
సేనాధిపతులు
రామ రాయలు దక్కన్ సుల్తానులు & సేనానులు
సైనిక బలములు
140,000 పదాతి, 10,000 అశ్విక మరియు 100కు పైగా యుద్ధ గజములు 80,000 పదాతి, 30,000 అశ్విక మరియు కొన్ని డజన్ల ఫిరంగులు
ప్రాణనష్టము
నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ రామ రాయలుతో సహా తీవ్ర ప్రాణ నష్టము. నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ ఒక మోస్తరు నుండి తీవ్ర ప్రాణ నష్టము.
తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 26) (జనవరి 23) న విజయనగర సామ్రాజ్యానికి, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉచ్ఛస్థితికి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాతి కాలంలో అచ్యుత రాయలు, ఆ తరువాత సదాశివ రాయలు పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు. వాస్తవంలో పూర్తి అధికారాలు అళియ రామరాయలు వద్ద ఉండేవి. అతడే దైనందిన పరిపాలనను నిర్వహించేవాడు.

యుద్ధ నేపథ్యం
*********
ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్కసారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచూ యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 నుండి 1565 వరకు విజయనగరంపై విజయం సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో బలపడింది.

శ్రీకృష్ణదేవరాయలు 1520 మే 19న బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్షాను చిత్తుగా ఓడించి రాయిచూరును స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత సుల్తాను విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, తన పొరుగున ఉన్న ముస్లిం రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. రాయచూరు ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పుతో పాటు సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది.

ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. తమ తగాదాల పరిష్కారం కోసం వారు రామరాయల సహాయం అడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్‌షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్‌షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో హుసేన్‌ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్‌షా కలిసి అలీ ఆదిల్‌షా పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్‌షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని కళ్యాణి వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్‌షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్‌షా అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.

సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇచ్చేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ఐతే, ఈ విషయం మీద చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు చరిత్రకారుల ప్రకారం రామరాయలు ముస్లిములు నివసించే ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను అవమానించేవాడని చెబుతారు. కాని కొందరు ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేక మంది ముస్లిములు పనిచేసేవారనీ, రామరాయలు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చేవాడనీ అంటారు.

విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయనగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షాకు చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయంలో ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్‌షాతో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి, ఆలీ ఆదిల్‌షా, హుస్సేన్‌షా లకు సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురు, చాంద్ బీబీ సుల్తానును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలు, బీబీ హదియా సుల్తానును హుసేన్‌షా కొడుకు, మూర్తజా పెళ్ళి చేసుకున్నాడు.

విజయనగరాన్ని పతనం చేయడానికి రామరాయలతో తన చెలిమిని త
ుంచుకొనే ఎత్తుగడను ఆలీ ఆదిల్‌షా వేశాడు. ఈ ఎత్తుగడలో భాగంగా తన వద్ద నుండి తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయవలసిందిగా కోరుతూ రామరాయలు వద్దకు ఒక రాయబారిని పంపాడు. ఆదిల్‌షా ఊహించినట్లు గానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. రాయబారం తిరస్కరించడంతో యుద్ధం మొదలు పెట్టేందుకు ఒక కారణం కూడా సమకూరింది.

యుద్ధ భూమి
********


ఈ యుద్ధం జరిగిన ప్రదేశంపై అనేక వాదనలు ఉన్నాయి. ఈ యుద్ధం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని కొందరు, కాదు తళ్ళికోట వద్ద జరిగిందని మరి కొందరు వాదిస్తారు. అయితే ఈ రెండు ప్రదేశాలు కాదని మరో రెండు వాదనలు ఉన్నాయి. రామరాజ్ఞ బఖైర్ మరియు కైఫియత్‍ల వంటి సాంప్రదాయక హిందూ రచనలు, మూలాలూ, యుద్ధము రాక్షసి తంగడి వద్ద జరిగిందని, ఫరిస్తా మొదలగు ముస్లిం చారిత్రికులు తళ్లికోట వద్ద జరిగిందని అభిప్రాయపడ్డారు.

దుర్గా ప్రసాదు అభిప్రాయం
విజయనగర సైన్యం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య మైదానంలో విడిది చేసింది. సుల్తానుల సమైక్య సైన్యం తళ్ళికోట అనే గ్రామం వద్ద విడిది చేసింది. యుద్ధం మాత్రం కృష్ణానదికి దక్షిణాన మస్కి మరియు హుక్కేరి నదుల సంగమ ప్రదేశములోని బన్నిహట్టి అనే ప్రదేశంలో జరిగింది.
రాబర్ట్ సెవెల్ అభిప్రాయం
తళ్ళికోట కృష్ణకు 25 మైళ్ళు ఉత్తరాన ఉంది. కానీ యుద్ధం, కృష్ణకు దక్షిణాన రామరాయలు విడిది చేసిన ముద్గల్ నుండి పది మైళ్ల దూరంలో జరిగింది. సుల్తానుల కూటమి కృష్ణానది వంపులో ఇంగల్గి గ్రామము వద్ద దాటి ఉండవచ్చు. కాబట్టి యుద్ధం ఇంగలిగి గ్రామం నుండి ముద్గల్ పోయే దారిలో భోగాపూర్ (బాయాపూర్) అనే గ్రామం వద్ద జరిగి ఉండవచ్చు.
యుద్ధ వివరణ
*********
నలుగురు సుల్తానులు తమ సైన్యాలను బీజాపూరు సమీపంలోని ఒక మైదాన ప్రాంతంలో కలిపారు. 1564 డిసెంబర్ 25న ఈ కూటమి సైన్యాలు దక్షిణ ముఖంగా ప్రయాణించి కృష్ణకు 25 మైళ్ళ దూరంలోని తళ్ళికోట గ్రామం వద్దకు చేరుకున్నాయి. కూటమి సైన్యాలు చాలా రోజుల పాటు అక్కడే విడిది చేశాయి.

అక్కడ విజయనగరములో రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. తన తమ్ముళ్ళు తిరుమల రాయలు, వెంకటాద్రి రాయలుల సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి, తంగడి గ్రామాల మధ్యన సైన్యాన్ని మోహరించాడు. సుల్తాను సైన్యం నదిని దాటే అవకాశం గల అన్ని చోట్ల కాపలాను, పహారాను ఏర్పాటు చేశాడు.

అయితే సుల్తానుల సైన్యం నది దిగువగా ప్రయాణం చేస్తున్నట్లుగా రామరాయల సైన్యాన్ని నమ్మించి, ఒకరాత్రి వేళ నదిని దాటడం ప్రారంభించింది. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజున - 1565 జనవరి 23 (యుద్ధం జరిగిన తేదీని ఫరిష్తా జనవరి 23గా గుర్తించాడు. రాబర్ట్ సెవెల్ కూడా తన పుస్తకంలో అదే తేదీని తీసుకున్నాడు.) - రెండు పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు ఆలీ ఆదిల్‌షాను, మధ్యన రామరాయలు హుసేన్ నిజాంషాను, కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, ఆలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహ రచన చేశాడు. దక్కన్ సుల్తానుల కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఈ ఫిరంగులను కప్పిపుచ్చుతూ రెండువేలమంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాల వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపైకి దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకుని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన ఫిరంగి దాడులతో విజయనగర సైన్యం వెనకడుగు వేసింది.

పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. మధ్యభాగంలోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటూ రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకీని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించి, సుల్తాను ముందు హాజరు పరచింది. హుసేన్‌షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు.

తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కి, నగరానికి పారిపోయాడు. రామరాయల కుమారుడు తన బంధువులతో సహా ఆనెగొంది నుండి మూడు కోసుల దూరములో ఉన్న ఒక లోతైన గుహలో తలదాచుకున్నాడు
.

విజయనగర సైన్యం ఓటమికి కారణాలు
************
హిందూ సైన్యములో వేగంగా కదిలే అశ్వాలు తక్కువ. మెల్లగా కదిలే ఏనుగులపై ముఖ్య సేనాధిపతులుండగా సుల్తానుల సైన్యములో పారశీక అశ్వములపై సుశిక్షుతులైన యోధులున్నారు. ఇది సహజంగా సుల్తానులకు లాభించింది.
సుల్తానుల సేనాధిపతులు యువకులు కాగా విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసు మీరిన వారు -రామరాయలతో సహా.
హిందూ సైనికుల వద్ద వెదురు బద్దలతో చేసిన ధనుస్సులుండగా ముస్లింలవద్ద లోహముతో చేసిన ధనస్సులున్నాయి. వీటివల్ల బాణములు వేగంగా, గురి తప్పకుండా ఛేదిస్తాయి.
విజయనగర సైనికుల వద్ద ఏడు అడుగుల బల్లేలు, ఈటెలూ ఉన్నాయి. సుల్తానుల అశ్వ సైనికుల వద్ద పదిహేను అడుగుల పొడవున్న బల్లేలున్నాయి.
సుల్తానుల సైన్యములో తుర్కిస్తాన్ నుండి వచ్చిన సుశిక్షితులైన తుపాకిధారులుండగా విజయనగర సైన్యములో సరైన శిక్షణలేని యూరోపియను కూలి సిపాయిలు ఉన్నారు.
అన్నింటికన్నా ముఖ్య కారణం, వేలాది హిందూ సైనికులకు నాయకత్వము వహించుతున్న జిలాని సోదరుల వెన్నుపోటు. గతంలో అదిల్ షా వద్దనుండి పారిపోయి వచ్చి రామరాయల ఆశ్రయము పొందిన ఈ సోదరులు కీలక సమయములో యుద్ధరంగాన్ని వదలి పోవటం .
పర్యవసానాలు
***********
ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.

Tuesday, September 10, 2019

లష్కర్ బోనాలు.. ఉజ్జయని మంహంకాళి జాతర

లష్కర్ బోనాలు.. ఉజ్జయని మంహంకాళి జాతర



హైదరాబాద్‌, సికిందరాబాద్‌ నగరాలలో జాతర అంటేనే లష్కర్‌ బోనాలుగా పరిగణిస్తారు. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. గ్రామదేవతలైన అమ్మవారికి ఆషాడ మాసంలో జాతరలు చేసి, బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్యం సుభిక్షంగా ఉంటుదని నమ్మకం. తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతరలు ప్రారంభమవుతాయి.
సికింద్రాబాద్‌ బోనాలను ఉజ్జయని మహాంకాళి బోనాలు అని ఎందుకు అంటారు.. ఆ పేరు ఎలా వచ్చింది.. తెలియాలంటే ఉజ్జయని మహాంకాళి దేవాలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే..

*ఆలయ చరిత్ర*

ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైనది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చారు. ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబసభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణ చేసి పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్‌లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డబావిని పురుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. 1815 నుండి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి, వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు. అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు.

Tuesday, November 28, 2017

TRT.TSPSC decided the syllabus of old text books of Telangana and Andhra pradesh before 2012.

Download DSC|TRT old syllabus books.Telangana governement released notification for recruitment of Teachers in various departments.SGT,SA,LAUNGUAGE PANDIT,PET,Physical Education,Exam will be conducted on February second week.TSPSC will conduct the exam of TRT.TSPSC decided the syllabus of old text books of Telangana and Andhra pradesh before 2012.there available Pragathi avanigadda old syllabus meterial For the students who appearing for SGT in telangana.



  • Click hear to Download Maths
  • Click hear to Download Biology
  • Click hear to Download Physics
  •  

    Click hear to Download Chemistry  

    Click hear to Download History  

    Click hear to Download Economics
  •  

  • Click hear to Download Civics
  • Click hear to Download Geography
  • Click hear to Download P.Ed (SGT & SA)



  •  

     

     

    Monday, April 17, 2017

    telangana udyama charitra




    Tags: telangana udyama charitra telangana udyama charitra telugu academy  telangana udyama charitra books  telangana udyama charitra wikipedia  telangana udyama charitra bits  telangana history in telugu pdf  telangana udyamam in telugu  telangana udyama charitra audio  telangana history in telugu for competitive exams ts gurukulam notification  tspsc gurukulam syllabus 2017  ts gurukulam tgt syllabus  ts gurukulam syllabus 2017  ts gurukulam recruitment  gurukulam recruitment 2017 telangana  telangana gurukulam syllabus  ts gurukulam application form rao iit academy video lectures  rao iit academy study material  rao iit chemistry video lectures  rao iit academy student login  rao iit academy chemistry  rao iit academy physics  rao iit chemistry lectures  rao iit academy

    Tuesday, April 11, 2017

    భక్తి, సూఫీ ఉద్యమం



    భక్తి, సూఫీ ఉద్యమం 

    • ·         శంకరాచార్యులు ఎక్కడ జన్మించారు  - కాలడి (కేరళ)
    • ·         శంకరాచార్యులు బోధించిన సిద్దాంతం ఏది? – అద్వైతం
    • ·         శంకరాచార్యుల గురువు ఎవరు ? – గోవిందపాల
    • ·         ఉపనిషత్తులు, గీతపై వ్యాఖ్యలు రాసింది ఎవరు ? – శంకరాచార్యులు]
    • ·         రామానుజాచార్యులు ఎక్కడ జన్మించారు – శ్రీ పెరంబూర్
    • ·         రామానుజాచార్యులు బోధించిన సిద్థాంతం? విశిష్ట అద్వైతం
    • ·         రామానుజాచార్యులు ప్రారంభించిన వైష్ణవములోని తెగ ఏది ? శ్రీవైష్ణవ తెగ
    • ·         మధ్యాచార్య ఎక్కడ జన్మించారు – కెనర (కర్ణాటక)
    • ·         మధ్యాచార్య బోదించిన తత్వ సిద్ధాంతం ఏది ? ద్వైతం
    • ·         మధ్యాచార్య ఏవరి భక్తుడు ? - విష్ణు భక్తుడు
    • ·         ఆంద్రాకు చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు – నింబార్కుడు
    • ·         నింబార్కుడు బోధించిన సిద్థాంతం ఏది ?- ద్వైతాద్వైతము
    • ·         వల్లభాచార్యలు ఎక్కడ జన్మించారు – వారణాసి (ఉత్తరప్రదేశ్)
    • ·         వల్లభాచార్యలు బోధించిన సిద్థాంతం ఏది ? - శుద్దాద్వైతం

    Thursday, March 30, 2017

    గ్రంథాలు – రచయితలు


     
    గ్రంథాలు రచయిత
    » పాలిటిక్స్, ఎథిక్స్, మెటా ఫిజిక్స్ - అరిస్టాటిల్

    అరిస్టాటిల్
    » రిపబ్లిక్ - ప్లేటో
    » దాస్ క్యాపిటల్, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో - కార్ల్ మార్క్స్
    » ఎమిలీ, సోషల్ కాంట్రాక్ట్ - రూసో
    » ఏషియన్ డ్రామా - గున్నార్ మిర్డాల్
    » డివైన్ కామెడీ - డాంటే
    » ఉటోపియా - ధామస్ మోర్
    » మదర్, ఎనిమిస్ - మాక్సిం గోర్కి

    మాక్సిం గోర్కి
    » ఏ టేల్ ఆఫ్ టు సిటీస్, ఆలివర్ ట్విస్ట్, పిక్నిక్ పేపర్స్, హార్డ్ టైమ్స్ - చార్లెస్ డికెన్స్
    » ఇలియడ్, ఒడిస్సీ (ప్రాచీన గ్రీకు ఇతిహాసాలు) - హోమర్
    » రోమియో అండ్ జూలియట్, ది మర్చంట్ ఆఫ్ వెనిస్, ఆంటోని అండ్ క్లియోపాత్ర, హామ్లెట్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, యాజ్ యు లై కిట్, మ్యాక్ బెత్, టెంపెస్ట్, ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ - విలియం షేక్స్ పియర్

    విలియం షేక్స్ పియర్
    » ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ - జాన్ ఆస్టిన్
    » ది డేంజరస్ సమ్మర్ - ఎర్నెస్ట్ హెమ్మింగ్ వే
    » ఫ్యామిలీ మ్యాటర్స్ - రోహింటన్ మిస్త్రీ
    » సెవెన్ ల్యాంప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆన్ టు ది లాస్ట్ - జాన్ రస్కిన్
    » ప్రిన్స్ - మాకియావెల్లి
    » ఇన్ ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ (డచ్) - ఇరాస్మస్
    » వన్ లైఫ్ - క్రిస్టియన్ బెర్నార్డ్
    » ఏ ప్యాసేజ్ టు ఇండియా - ఇ.ఎం. ఫాస్టర్
    » అన్నా కరెనినా - లియోటాల్ స్టాయ్

    లియోటాల్ స్టాయ్
    » మీన్ కాంఫ్ - అడాల్ఫ్ హిట్లర్
    » డిప్లమసీ - హెన్రీ కిసింజర్
    » బెన్ హర్ - లెవిన్ వాలెస్
    » లెవిన్ వాలెస్ - రిచర్డ్ అటెన్ బరో
    » సిటీ ఆఫ్ జాయ్, ఎ థౌజండ్ సన్స్ - డొమినిక్ లాఫ్రే
    » మదరిండియా - కాథరిన్ మెమో
    » ది గోల్డెన్ గన్, ది సౌండ్స్ ఆఫ్ మార్క్ - ఆర్థర్ సి. క్లార్క్
    » ఇండియా ఇన్ స్లో మోషన్ - మార్క్ టుల్లీ
    » హ్యూమర్ - బెన్ జాన్సన్
    » ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ - కాథరిన్ ఫ్రాంక్
    » కేసినో రాయల్ (జేమ్స్ బాండ్) - ఇయాన్ ఫ్లెమింగ్
    » ది జంగిల్ బుక్ - రుడియార్డ్ క్లిప్పింగ్

    ఐన్ స్టీన్
    » ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ - ఐన్ స్టీన్
    » ది నెక్ డ్ ఫేస్ - సిడ్నీ షెల్టన్
    » మూన్ వాక్ - మైకేల్ జాక్సన్
    » బుక్ ఆఫ్ హ్యూమర్, బుక్ ఆఫ్ నేచర్ - రస్కిన్ బాండ్
    » ఫ్రీడం ఫ్రం ఫియర్ - ఆంగ్ సాన్ సూకీ

    నెల్సన్ మంలా
    » లాంగ్ వాక్ టు ఫ్రీడం, స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ - నెల్సన్ మండేలా
    » ది కాంటర్ బరీ టేల్స్ - జెఫ్రీ ఛాసర్
    » లీడర్స్ - రిచర్డ్ నిక్సన్
    » వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ - ఆలివ్ గోల్డ్ స్మిత్
    » మిడ్ నైట్ ఇన్ భోపాల్, ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ - లారీ కోలిన్స్
    » ది జంగిల్ బుక్ - రుడియార్డ్ క్లిప్పింగ్
    » డాటర్ ఆఫ్ ది ఈస్ట్ - బెనజీర్ భుట్టో
    » గ్రేట్ ట్రాజెడీ, ఇఫ్ ఐ యామ్ ఎసాసినేట్ - జుల్ఫీకర్ అలీ భుట్టో
    » జుల్ఫీకర్ అలీ భుట్టో - మైఖేల్ క్రిచ్ టన్
    » ఫెయిరీ క్వీన్ - ఎడ్వర్డ్ స్పెన్సర్
    » డావించీ కోడ్ - డాన్ బ్రౌన్
    » మై ఎర్లీ లైఫ్, ది సెకండ్ వరల్డ్ వార్ - విన్ స్టన్ చర్చిల్
    » ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్, ది పెయింటెడ్ వీల్ - సోమర్ సెట్ మామ్

    సోమర్ సెట్ మామ్
    » సచిన్; ద స్టోరీ ఆఫ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్యాట్స్ మెన్, గ్రేట్ వన్డే ఇంటర్నేషనల్ - గులు ఎజేకిల్
    » బ్రాడ్ మన్స్ బెస్ట్ - రోలాండ్ ఫెర్రి
    » 2001; ఏ స్పేస్ ఒడిస్సీ - సర్ ఆర్థర్ సి క్లార్క్
    » ది రోడ్ ఎ హెడ్ - బిల్ గేట్స్
    » స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్ - చెర్రి బ్లెయర్
    » రీడ్ ఆల్ ఎబౌట్ ఇట్ - లారాబుష్, జెన్నా బుష్
    » లివింగ్ హిస్టరీ - హిల్లరీ క్లింటన్
    » ఓడ్ టు ఏ నైటింగేల్, ఇసాబెల్లా టు ఆటమ్, ది ఈవ్ ఆప్ సెయింట్ ఆగ్నేస్ - జాన్ కీట్స్

    జాన్ కీట్స్
    » ఆన్ ద షోల్డ్ ఆఫ్ హోప్ - పోప్ జాన్ పాల్ -2
    » ఏ స్టడీ ఆఫ్ ఫికల్ కల్చర్ - మావో – ట్సే – టుంగ్

    భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు


     
    క్రీస్తు పూర్వం
    » 3000-1500 - సింధునాగరికత కాలం

    బుద్ధుడు
    » 576 - బుద్ధుడి జననం
    » 527 - మహావీరుడి జననం
    » 327-326 - భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.
    » 313 - జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం.
    » 305 - సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.
    » 273 - 232 - అశోకుడి పాలన
    » 145 - 101 - చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
    » 58 - విక్రమ శకం ప్రారంభం
    క్రీస్తు శకం
    » 78 - శక యుగం ప్రారంభం
    » 120 - కనిష్కుడి పట్టాభిషేకం
    » 320 - గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)
    » 380 - విక్రమాధిత్యుడి పట్టాభిషేకం
    » 405-411 - ఫాహియాన్ భారత సందర్శన
    » 415 - మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం
    » 455 - స్కందగుప్తుడి పట్టాభిషేకం
    » 606-647 - హర్షవర్థనుడి పాలనా కాలం
    » 712 - మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర
    » 836 - కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం
    »985 - రాజరాజచోళుడి పట్టాభిషేకం
    » 998 - సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం
    » 1001 - భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.
    » 1025 - గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం.
    » 1191 - మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. 
    పృథ్విరాజ్ విజయం సాధించాడు.
    » 1192 - తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.
    » 1206 - కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన
    » 1210 - కుతుబుద్దీన్ ఐబక్ మరణం
    » 1221 - భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.
    » 1236 - రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.
    » 1240 - రజియా సుల్తానా మరణం.
    » 1246 - బాల్బన్ పాలన ప్రారంభం
    » 1296 - అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.
    » 1316 - అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.
    » 1325 - మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.
    » 1327 - తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు.
    » 1336 - దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.
    » 1351 - ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.
    » 1388 - ఫిరోజ్ తుగ్లక్ మరణం
    » 1398 - భారత్ పై తైమూర్ దండయాత్రలు

    గురునానక్
    » 1469 - గురునానక్ జననం
    » 1494 - ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.
    » 1497-98 - భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.
    » 1526 - మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.
    » 1527 - కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు.
    » 1530 - బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.
    » 1539 - హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.
    » 1540 - కనౌజ్ యుద్ధం
    » 1555 - ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు.
    » 1556 - రెండో పానిపట్టు యుద్ధం
    » 1557 - గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ
    » 1565 - తల్లికోట యుద్ధం
    » 1576 - హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.
    » 1582 - దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.
    » 1597 - రాణా ప్రతాప్ మరణం
    » 1600 - ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
    » 1605 - అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.
    » 1611 - నూర్జహన్ తో జహంగీర్ వివాహం.
    » 1616 - జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.

    శివాజీ
    » 1627 - శివాజీ జననం. జహంగీర్ మరణం.
    » 1628 - షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.
    » 1631 - ముంతాజ్ మహల్ మరణం.
    » 1634 - భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.
    » 1659 - సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష
    » 1665 - శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.
    » 1666 - షాజహన్ మరణం.
    » 1675 - సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష
    » 1680 - శివాజీ మరణం.
    » 1684 - బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.
    » 1707 - ఔరంగజేబు మరణం.
    » 1708 - గురుగోవింద్ సింగ్ మరణం.
    » 1780-84 - రెండో మైసూర్ యుద్ధం.
    » 1784 - పిట్స్ చట్టం.
    » 1790-92 - మూడో మైసూర్ యుద్ధం
    » 1793 - బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్
    » 1799 - నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.
    » 1802 - బేసిన్ ఒప్పందం
    » 1809 - అమృతసర్ ఒప్పందం

    రాజా రామమోహన్ రాయ్
    » 1828 - రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
    » 1829 - సతీసహగమన ఆచారం నిషేధం
    » 1830 - బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
    » 1833 - రాజారామమోహన్ రాయ్ మరణం.
    » 1838 - కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
    » 1839 - మహారాజా రంజిత్ సింగ్ మరణం
    » 1839-42 - మొదటి ఆగ్రా యుద్ధం
    » 1845-46 - మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
    » 1852 - రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
    » 1853 - బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
    » 1857 - సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
    » 1861 - రవీంద్రనాథ్ ఠాగూర్ జననం

    రవీంద్రనాథ్ ఠాగూర్
    » 1867 - బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
    » 1869 - మహాత్మా గాంధీ జననం
    » 1875 - స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
    » 1876 - సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.
    » 1885 - భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
    » 1885 – 1905 - మితవాద యుగం
    » 1889 - జవహర్ లాల్ నెహ్రూ జననం

    స్వామి వివేకానంద
    » 1893 - చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
    » 1897 - సుభాస్ చంద్రబోస్ జననం
    » 1904 - టిబెట్ యాత్ర
    » 1905 - లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
    » 1906 - ముస్లిం లీగ్ స్థాపన
    » 1906 – 1920 - అతివాద యుగం
    » 1909 - మింటో – మార్లే సంస్కరణలు
    » 1911 - ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
    » 1913 - గదర్ పార్టీ ఏర్పాటు
    » 1914 - మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
    » 1915 - భారత దేశానికి గాంధీజీ రాక.
    » 1916 - కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
    » 1917 - చంపారన్ ఉద్యమం
    » 1918 - మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
    » 1919 - మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
    » 1920 - ఖిలాఫత్ ఉద్యమం
    » 1921 - ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
    » 1922 - చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
    » 1922 - మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
    » 1926 - భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
    » 1927 - సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
    » 1928 - పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
    » 1929 - మీరట్ కుట్ర కేసు
    » 1929 - లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
    » 1930 - సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
    » 1931 - గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
    » 1932 - మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
    » 1935 - భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
    » 1937 - ప్రొవిన్షియల్ అటానమీ.
    » 1939 - రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.
    » 1941 - రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
    » 1942 - క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
    » 1942-44 - ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
    » 1945 - వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.
    » 1946 - క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.
    » 1947 - అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.
    » 1948 - గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.
    » 1949 - కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
    » 1950 - గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
    » 1951 - మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.
    » 1952 - లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.
    » 1956 - రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.
    » 1957 - దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి
    » 1963 - పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.

    లాల్ బహదూర్ శాస్త్రి
    » 1964 - జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.
    » 1965 - భారత్ పై పాకిస్థాన్ దాడి
    » 1966 - తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.

    ఇందిరా గాంధీ
    » 1967 - నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
    » 1969 - భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.
    » 1970 - రాష్ట్రంగా మేఘాలయ
    » 1971 - కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.
    » 1972 - సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.
    » 1973 - మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.
    » 1974 - భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
    » 1975 - ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.
    » 1976 - భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.
    » 1977 - ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం 
    సంజీవరెడ్డి.
    » 1979 - ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.
    » 1980 - ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
    » 1982 - మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
    » 1983 - ఢిల్లీలో చోగమ్ సదస్సు
    » 1984 - పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.

    రాజీవ్ గాంధీ
    » 1985 - రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
    » 1986 - మిజోరాం ఒప్పందం
    » 1987 - రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.
    » 1989 - అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.
    » 1990 - వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.
    » 1991 - జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.

    పీవీ నరసింహారావు
    » 1992 - ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
    » 1993 - జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
    » 1994 - పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
    » 1995 - ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
    » 1996 - హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
    » 1997 - భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

    అటల్ బిహారి వాజ్ పేయీ
    » 1998 - మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
    » 1999 - డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.
    » 2000 - అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.
    » 2001 - జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.
    » 2002 - అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.

    అబ్దుల్ కలాం
    » 2003 - ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.
    » 2004 - సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.