Sunday, July 3, 2016

విద్యా హాక్కు చట్టం 2009 ( ఉచిత నిర్బంధ విధ్య కు బాలల హక్కుల చట్టం )

విద్యా హాక్కు చట్టం 2009 ( ఉచిత నిర్బంధ విధ్య కు బాలల హక్కుల చట్టం )

  • ఈ చట్టం లో 7 అధ్యాయాలు 38 నిబంధనలు కలవు.
  • ఈ చట్టాన్ని ఉచిత, నిర్బందవిద్యకు బాలల హక్కు చట్టం, ఆగస్ట్ 2009 గా పిలువవచ్చును.
  • 2009 జులై 20 వ తేదీన భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది.
  • ఆగస్ట్ 26, 2009 న భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపినారు.
  • ఈ చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశమంతంటికీ వర్తిస్తుంది.
  • బాలలు అంటే 6-14 సం.ల బాలబాలికలు
  • ప్రాధమికవిధ్య అంటే 1-8 తరగతుల వరకు
  • T.C లేకపోయినా, విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదు.
  • చట్టం అమలుకు నిధులు వాటా కేంద్ర, రష్ట్ర ప్రభుత్వాలు 65:35 ప్రకారం భరిస్తాయి.
  • క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి 10 రెట్ల వరకూ జరిమానా
  • గుర్తింపు లేకుండా, గుర్తింపు రద్దయిన తర్వాత బడి నడిపితే   లక్షరూపాయిలు జరిమానా, ఒకవేళ ఉల్లంఘన ఇంకా కొనసాగినట్లయితే ప్రతిరోజు రూ. 10,000లు జరిమానా
  • ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10% కి మించరాదు.
  • ఏ టీచరూ కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధన చేయరాదు.


Tags:విద్యా హాక్కు చట్టం 2009 ( ఉచిత నిర్బంధ విధ్య కు బాలల హక్కుల చట్టం ), విద్యా హాక్కు చట్ట, ఆగస్ట్ 2009, విద్యా సంవత్సరం